మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన రమేష్ జి
జనం న్యూస్ – సెప్టెంబర్ 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో 30వ తారీకు మంగళవారం సాయంత్రం జరగనున్న సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని నందికొండ మున్సిపల్ కమిషనర్ చింత వేణుకు వినతిపత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం 6 గంటలకు హిల్ కాలనీలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో జరగనున్న సద్దుల బతుకమ్మ పండుగకు పెద్ద ఎత్తున మహిళలు హాజరవుతారని కావున ఆలయంలో తగిన ఏర్పాట్లు చేయించాలని, డౌన్ పార్క్ తెలంగాణ టూరిజం పాత లాంచి స్టేషన్ వద్ద బతుకమ్మలను నిమర్జనం చేయు కార్యక్రమానికి లైటింగ్ ను ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హాజరయ్యే మహిళలకు పిల్లలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ను కలసి వినతి పత్రం అందజేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉద్యమకారుల ఫారం మహిళా కార్యదర్శి కాయతి జానకి రెడ్డి, సపావత్ చంద్రమౌళి నాయక్ తదితరులు పాల్గొన్నారు.


