Listen to this article

మద్నూర్ సెప్టెంబర్ 27 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కోడిచీర గ్రామంలో శనివారం నాడు గ్రామస్తులు,భక్తులు బాలాజీ జెండాకు ఉదయం నుండి ప్రత్యేక పూజలు హారతులు, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరము గ్రామస్తులు భక్తులకు అన్న ప్రసాదము చేసినారు. ఈ బాలాజీ జెండాకు ప్రత్యేకత ఉందని దాదాపు 100 సంవత్సరాల నుండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర నుండి ఈ బాలాజీ జెండాను తీసుకువచ్చి మహారాష్ట్రలోని దెగ్లూరులో ప్రతిష్టాపించినారని అక్కడి నుండి ప్రతి సంవత్సరం దసరా ముందు మద్నూర్ మండల కేంద్రానికి తీసుకువచ్చి 11 రోజులు ప్రత్యేక పూజలు,అన్నదాన కార్యక్రమం నిర్వహించి అక్కడి నుండి కోడిచీర గ్రామానికి తీసుకువచ్చి ఇక్కడ కూడా 11 రోజులు ప్రత్యేక పూజలు హారతులు దేవునికి కట్న కానుకలు సమర్పించుకుంటారు. మద్నూరు, కొడిచీర గ్రామ భక్తులు సమర్పించిన కట్న కానుకలు శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుతాయని బాలాజీ జెండా నిర్వాహకులు తెలిపారు.