జుక్కల్ సెప్టెంబర్ 28 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవం సందర్భంగా జుక్కల్ సార్వజనిక్ దుర్గ భవాని దర్శనం తీసుకున్న జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి చల్లని దీవెనలు నా నియోజకవర్గ ప్రజల పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం దుర్గ దేవి కమిటీ అధ్యక్షులు నీళ్లు పటేల్ మాజీ ఎమ్మెల్యేను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎంపీపీ యశోద నీళ్లు పటేల్, మాజీ సర్పంచ్ రాములు సెట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, మాజీ సర్పంచ్ గంగాధర్, సింగిల్ విండో చైర్మన్ శివానంద్, మాజీ సర్పంచ్ కపిల్ పటేల్, మాజీ సర్పంచ్ శివాజీ పటేల్, గ్రామ ఉపసర్పంచ్ భాను ప్రసాద్ గౌడ్, కోడ్చిరే మారుతి పటేల్, వాసరే రమేష్, గోపాల్ సెట్, సత్యం సేట్, నరేష్ సెట్, హనుమాన్లు, అశోక్ రెడ్డి, రమేష్, కృష్ణ మౌలి, కండే రావు తదితరులు పాల్గొన్నారు..




