జనం న్యూస్ సెప్టెంబర్ 28 దుబాయ్ :
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఘనంగా జరుపుకుంటుండటం గర్వకారణమని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి అన్నారు.దుబాయ్‌లో ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ (ఐపీఏఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, పలువురు ఎంపీలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన రాష్ట్రములో గొప్పగా జరుపుకునే పండుగను దుబాయ్‌లో కూడా ఇంత అంగరంగ వైభవంగా జరపడం సంతోషకరం. మన సంస్కృతి, సంప్రదాయాలను ఇక్కడ ఉన్నవారు దూర దేశాల్లోనూ అలానే కొనసాగించడం నిజంగా గొప్ప విషయం” అనిఅభినందించారు.తీరొక్క పూలను అందంగా పేర్చి, ఆటపాటలతో పూలనే పూజించే బతుకమ్మ పండుగ ప్రత్యేకతను వివరించిన ఆయన, “మన బతుకమ్మ వేడుకలు ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యాయి. ప్రతి దేశంలో ఈ పండుగను ఘనంగా నిర్వహించడం గర్వించదగిన విషయం” అని పేర్కొన్నారు.ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన ఐపీఏఫ్ సంస్థ ప్రతినిధులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


