జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు
ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా యుపిసిహెచ్ మధర్ దెరిస్సా కాలనీలో ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ వారు నిర్వహించారు.అంగన్వాడి కేంద్రం నందు అందించే పోషకాహారాన్ని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక నిలువబడి వంటకాలను స్టాల్ నందు ప్రదర్శించడం జరిగింది.దీని 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్స్ కవిత నాగలక్ష్మి, జతిన్ దేవి, సూపర్వైజర్ ఎన్. హనుమాయమ్మ,తోపాటు అంగన్వాడి ఉపాద్యాయులు బి.శ్రీదేవి భాయి,యు.లక్ష్మి,కె. రోజ్ మేరీ ఆర్.రమాదేవి తోపాటు పలువురు పాల్గొన్నారు.


