జనం న్యూస్,సెప్టెంబర్ 28,అచ్యుతాపురం:
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనందకుమార్ సౌజన్యంతో రేపు అనగా 29 తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి ప్రశాంతి పాలిటెక్నికల్ కళాశాల వద్ద సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, వైద్య శిబిరంలో ఆధునిక పరీకరాలతో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని
భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజాన సన్యాసి నాయుడు,జిల్లా కార్యదర్శి చిన్నారావు, మండల అధ్యక్షుడు కూండ్రపు నాయుడు బాబు తెలిపారు.అలాగే ఎల్ కెజి నుండి పిజి వరకు విద్యార్థులను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకొని భారతీయ జనతా పార్టీ మరియు దీన్ దయాల్ శ్రావణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వినికిడి సమస్య లేని భారత్ దేశం- వినికిడి సమస్యలేని ఆంధ్రప్రదేశ్ కొరకు సేవా పఖ్వాడ 2025లో భాగంగా ఉచిత వినికిడి మిషన్లు కొరకు నమోదు కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని బీజేపీ నాయకులు తెలిపారు.


