జనం న్యూస్ 28 సెప్టెంబర్ తొర్రూరు డివిజన్ ప్రతినిధి
చెర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు.యాకయ్య మహబూబా దంపతుల కుమారుడు ధర్మారపు లోకేష్ ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలలో ఉత్తమ ర్యాంక్ సాధించి ప్రభుత్వ మెడికల్ కళాశాల మంచిర్యాలలో అడ్మిషన్ పొందాడు. ఈరోజు ఆ విద్యార్థి తన పేరెంట్స్ తో కలిసి తను ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకున్న లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు వెళ్ళి యాజమాన్యాన్ని ఉపాధ్యాయులను కలిసి కృతజ్ఞతలు తెలిపి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. కరస్పాండెంట్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి లోకేష్ ను అభినందించి శాలువాతో సత్కరించి , ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భం గా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి కూడా పట్టణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకంటే ఉత్తమ విద్యార్థులను తయారు చెయ్యడమే మా లక్ష్యం అని ఈ సారి ముగ్గురు విద్యార్థులు మా పాఠశాల నుండి మెడిసిన్ సాధించారని అన్నారు. మా పాఠశాలనుండి ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్ళే పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తామని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రతి సంవత్సరం పాఠశాలలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించి వారిద్వారా ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు ప్రేరణ కలగజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్లు నాగిరెడ్డి , సంపత్ కుమార్ ,ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు ఉపాధ్యాయులు ఓంప్రకాష్ మురళీకృష్ణ భాస్కర్ సూర్య విద్యార్థి తండ్రి యాకన్న గ్రామస్థులు మహేందర్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


