Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం

మహిళలకు ఇస్తానన్న రెండు బతుకమ్మ చీరలు ఎక్కడా అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించ్చిన మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణా రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ రంజాన్ పండగకి రంజాన్ తోఫా, క్రిష్టమస్ పండుగకు క్రిస్మస్ కానుకగా బట్టలు దసరా పండుగకి బతుకమ్మ చీరలు ఇచ్చి గౌరవించ్చే సంప్రదాయాన్ని గత ప్రభుత్వం చేస్తే నేటి ప్రభుత్వం కేసీఆర్ ఒక్క చీర ఇచ్చిండు మేము రెండు చీరలు ఇస్తామని ఎన్నో ప్రగాల్బాలు పలికారు.సద్దుల బతుకమ్మ పండుగ సమీపిస్తుంది ఇప్పటి వరకు బతుకమ్మ చీరల ఊసే లేదు.అధికారులను అడిగితే చీరలు వచ్చినవి, గోదాంలల్లో ఉన్నవి కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పుతున్నారు.అంటే ఈ ప్రభుత్వం మహిళలను ఎలా గౌరవిస్తుందో తెలుస్తుంది.అధికారంలోకి రావడానికి మహిళలకు ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసిర్రు.మహిళా సోదరీమణులు ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలు, మాట తప్పే విధానాలను గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం అని తెలిపారు…