Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు నాగిరెడ్డిపల్లి పంచాయతీ నందలి బచ్చు భవన్ నందు దేశం గర్వించదగ్గ ఇరువురు మహనీయుల( భగత్ సింగ్ మరియు గుర్రం జాషువా) జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ జయ భాస్కరరావు అధ్యక్షతన నివాళు లర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా లయన్ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ గుర్రం జాషువా పల్నాడు ప్రాంతంలో జన్మించారని వారు తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై జలుపిస్తూ సుప్రసిద్ధ నవలలు గబ్బిలం మరియు పిరదోసి లాంటి మంచి ప్రాముఖ్యత పొందిన నవలల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేశారని అటువంటి మహనీయుని జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగిందని తెలిపారు తదుపరి భారత స్వతంత్ర ఉద్యమ పోరాటంలో వేలాదిమంది యువకులు స్ఫూర్తిని నింపుతూ బ్రిటిష్ వారి పై పోరాటం సలిపి చరిత్ర పుటలకు ఎక్కిన సర్దార్ భగత్ సింగ్ పంజాబ్లో జన్మించారు ఇప్పుడు ఆయన జన్మస్థలం దేశ విభజన కారణంగా పాకిస్థాన్లో ఉన్నదని, తన 13వ ఏటనే భారత స్వాతంత్ర ఉద్యమ పోకడలు అలవర్చుకొని యువకులందరినీ ఏకం చేసి ఉద్యమం చేస్తున్న సమయంలో లాలా లజపతిరాయ్ ని బ్రిటిష్ వారు కొట్టి చంపడంతో ఆవేశానికి లోనై బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపారన్న ఆరోపణ మీద మరియు ఢిల్లీ శాసనసభ మీద బాంబు వేశారన్న ఆ కారణాలతో నిండా పాతికేళ్లు కూడా నిండని ఆ నవ యువకుడిని ఉరితీసి చంపడం జరిగింది, అటువంటి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ జయంతి సందర్భంగా కూడా మనందరం నివాళు లర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతూ క్లబ్ సభ్యు లందరూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ బచ్చు జయ భాస్కరరావు, లయన్ మన్నెం రామ మోహన్,కుర్రా మణి యాదవ్, ఉప్పు శెట్టి సుధీర్, మోడపోతుల రాము, మంటి మారయ్య,గండికోట కృష్ణ కుమార్, ఆంజనేయులు, తీగల కుంట వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.