Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 29 నడిగూడెం

మండల పరిధిలోని సిరిపురంలో శ్రీ కోదండరామస్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం దుర్గామాత చదువుల తల్లి సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది.విద్యార్థులు తమ పుస్తకాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించారు. అమ్మవారిని భక్తితో పూజించడం ద్వారా విద్య,కళలు,సంగీతం వంటి జ్ఞానాన్ని పొందుతారని పూజారులు వేదాంతం చక్రధరాచార్యులు,సాయి కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు.అమ్మవారికి పాయసం,పెసరట్టు,వడ పప్పు, దద్దోజనం,బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజా కార్యక్రమంలో భవాని దీక్ష స్వాములు,కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.