జనం న్యూస్ 29 శాయంపేట మండలం
భూపాలపల్లి.దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించింది. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య,కీర్తి,సంపదలు లభించి శత్రువులు మిత్రువులుగా మారటం, ప్రజలు ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవన్నీ సత్వరమే లభించాలని భూపాలపల్లి లో ని మంజూరు నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏడవ రోజు శ్రీ మహా చండీ అమ్మవారికి అభిషేకం,అర్చన చండీ పారాయణం కార్యక్రమాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఆలయ ధర్మకర్తలయిన గండ్ర వెంకట రమణా రెడ్డి – మాజీ జేడ్పీటీసీ జ్యోతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
అనంతరం గండ్ర జ్యోతి లలితా త్రిపురా సుందరీ దేవి ఆలయంలో నిర్వహిస్తున్న మహా చండీ హోమంలో పాల్గొన్నారు.


