జనం న్యూస్ ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ వారు ఆదివారం నాడు డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో రూపొందించిన మేరా భారత్ మహాన్ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రొపెసర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు చేతులమీదుగా ఘనంగా ఆవిష్కరణ జరిగింది. ఇందులో ”అందమైనది నాదేశం”శీర్షికతో చక్కని గేయాన్ని రచించినందుకు గాను సిద్దిపేట జిల్లాకు చెందిన కవి వంగరి వెంకటేశంను అభినందిస్తూ ప్రశంసాపత్రంతో పాటుగా “కీర్తి రత్న” పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో నంది పురస్కార గ్రహీత సాదనాల వెంకటస్వామి నాయుడు, గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, చౌడూరి నర్సింహరావు, పసుపులేటి నరేంద్ర కృష్ణ,బ్రహ్మశ్రీ దత్తశర్మ తదితరులు పాల్గొన్నారు. కీర్తి రత్న బిరుదు పొందినందుకు గాను సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, బస్వ రాజ్ కుమార్, కాల్వ రాజయ్య, కోణం పర్శరాములు తదితరులు అభినందనలు తెలిపారు.


