Listen to this article

బిచ్కుంద సెప్టెంబర్ 29 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద నందు సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ అధ్యక్షతన 59 వ మహాజన సభ నిర్వహించడం జరిగింది. .01.04.2025 నుండి 28.09.2025 వరకు గల జమ ఖర్చుల పట్టికలను పరిశీలించి ఆమోదించినారు.
.2024- 2025 ఆడిట్ అయిన అంశములను సభ్యులు పరిశీలించి ఆమోదించినారు.సంఘ పరిధిలోని గ్రామాలలో అకాలవర్షాలకు నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ 25000 చొప్పున ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానించారు.గత వానకాలం లో కొన్న వరి పంటకు మరియు ఈ రబీ సీజన్లో కోనుగోలు చేసే వరి పంటకు ఖచ్చితంగా రూ.500/ బోనస్ ఇవ్వాలనీ ప్రభుత్వానికి కోరుతూ తీర్మానించారు.సంఘ ఫైనాన్సింగ్ బ్యాంకు అయిన (sbi )ఎస్ బి ఐ బిచ్కుంద వారు లోన్లు అధిక వడ్డీ రేటున ఇస్తున్నారు కావున సంఘం ను డీసీసీబీ బ్యాంకు లో మెర్జ్ చేయాలని తీర్మానించారు.సంఘ పరిధిలోనీ అప్పు తీసుక్కున రైతులు సంఘం నందు వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకోవాలని తీర్మానించారు.ఇట్టి కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్, వైస్ చైర్మన్ యాదరవ్ డైరెక్టర్లు దర్పల్ సంజు, పోతుల అశోక్, సాయిని వినోద, శంకర్ నాయక్, అనిశెట్టి శివరాజ్, చంద్రకాంత్ పటేల్, గణపతి రెడ్డి ,ceo శ్రావణ్ కుమార్