జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 29 :
ఏన్కూరు మండలం బద్రుతండ గ్రామానికి చెందిన గుగులోత్ బగ్గు నాయక్‌ను మార్కెట్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ సందర్భంగా గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తండా ప్రజలకు గౌరవం లభించేలా చేసినందుకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు గుగులోత్ బగ్గు నాయక్ గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ నియామకం ద్వారా ప్రాంత అభివృద్ధికి మరింత సహకారం అందిస్తానని ఆయన అన్నారు. అలాగే స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ, రైతులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.


