Listen to this article

జనం న్యూస్, సెప్టెంబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో సోమవారం బతుకమ్మ పండుగ సంబరాలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, గ్రామ తాజా మాజీ సర్పంచ్ మాధవి రాజిరెడ్డి మాట్లాడుతూ, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే, పండుగలు బతుకమ్మ పండుగ ఒకటి అని, ప్రపంచంలో పువ్వులతో దేవతలను పూజిస్తే తెలంగాణలో పువ్వులనే దేవతలుగా పూజించే గొప్ప సాంప్రదాయం ఉన్నదని అన్నారు