జనం న్యూస్ సెప్టెంబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
స్థానిక అసోసియేషన్లు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని వారికి నాయకులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని టి పి సి సి ఉపాధ్యక్షుడు మరియు జైరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ సూచించారు.నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు డాక్టర్ పట్టోల్ల నాగిరెడ్డి వారి ప్యానల్ సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా బండి రమేష్ ని వారి కార్యాలయంలో కలవటం జరిగింది.ఈ సందర్భంగా రమేష్ నాగిరెడ్డి వారి ప్యానల్ సభ్యులను సన్మానం చేసి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు .ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాలనీ సమస్యల పరిష్కారం కోసం నాగిరెడ్డికి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా అందిస్తామన్నారు.కాలనీని గేటెడ్ కమ్యూనిటీ లాగే అభివృద్ధి చేయాలన్నారు . ఇది పేరుకే సంక్షేమ సంఘం ఎన్నికగా ఉంది గాని టిఆర్ఎస్ పార్టీ వాళ్లు దీన్ని రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నికలలా మార్చారని విమర్శించారు.ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాగిరెడ్డి తనదైన కృషితో వారి పానల్ సభ్యులు అందరూ కూడా విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి గర్వకారణం అన్నారు.ఇటీవల జరిగిన ప్రభాకర్ రెడ్డి నగర్ బాలాజీ నగర్ ఇందిరా గాంధీపురం ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా 19 సంవత్సరాలుగా తను సేవలందిస్తున్నానన్నారు పట్లోళ్ల నాగిరెడ్డి తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్యానల్ తో టైగర్ గుర్తుపై ఎన్నికలలో పోటీ చేశారు. ఇది స్థానిక సంక్షేమ సంఘం ఎన్నికలే అయినప్పటికీ రాజకీయాలు ప్రవేశించాయన్నారు సేవా భావంతో నే ముందుకెళ్తామని ప్రజా సమస్యలను అందరి సహకారంతో పరిష్కరిస్తామన్నారు డాక్టర్ పి నాగిరెడ్డి ప్యానెల్
బి నాగేశ్వర రావు, రాజు, పి. నరేశ్, పి శ్రీనివాస్, రాంబాబు, పెద్ద బాబు, లలిత యాదవ్, కె అపర్ణ మరియు డేవిడ్ రెండవ ప్యానెల్ కె బిక్షపతి, కె రవీందర్, వెంకట్ రావు, యశోద, శారద, చంద్ర రెడ్డి , పవన్ నాయుడు, పవన్ కుమార్ రెడ్డి, వెంకట్రావు, పాల్గొన్నారు. ఈయొక్క కాలనీ వెల్ఫేర్ ఎలెక్షన్స్ లో ఎప్పటి వరకు అప్పుడు జరుగని రీతిలో 90% వినియోగించుకోవడo జరిగింది.టైగర్ గుర్తు పి నాగిరెడ్డి ప్యానెల్ కు 318 ఓట్లు పాల్ అవ్వగా ఆటో గుర్తు, కె బిక్షపతి కి 274 ఓట్లు పోల్ అయ్యాయి. 44 ఓట్ల మెజారిటీ తో డా. పి. నాగిరెడ్డి విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు



