Listen to this article

జనం న్యూస్ 30 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

బిజెపి ఐజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల కన్వీనర్ ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపిటిసి జడ్పిటిసి స్థానాలను బిజెపి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేయడం జరిగినది.ఎందుకంటే రాష్ట్రంలో గత పార్లమెంటు ఎలక్షన్లలో అయిజ మండలం 2500 మెజార్టీ ఓట్లు అదే విధంగా 28 బూతులలో మెజార్టీ సాధించినది బిజెపి పార్టీ మిగతా 26 బూతులలో రెండు పార్టీలు కలిసి కూడా బిజెపి పార్టీకి వచ్చిన ఓట్లకు సమానం కాదు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ప్రతి ఎంపీటీసీ జెడ్పిటిసి స్థానాలకు బిజెపి పార్టీ నుండి ఎక్కువ మొత్తంలో పోటీదారులు ఉన్నారు ఒక్కొక్క స్థానానికి ముగ్గురు ఐదు మంది వరకు పోటీదారులు ఉండడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని ఒక్క పథకాన్ని కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ ను ఆ పార్టీ నాయకులను పార్టీ పథకాలను చూసి ఓటు వేసే వ్యక్తి లేడు గతంలో టిఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించి కుటుంబం అవినీతి తప్ప నువ్వు నేను అంటూ కుటుంబ సభ్యులు ఉద్యోగాలు తప్ప కోట్లు అర్జించడం తప్ప రాష్ట్రంలో ప్రజలకు చేసిన పథకాలు వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు ఎలాంటివి కూడా జనాలకు అందలేదు కాబట్టి రాబోయే స్థానిక ఎంపిటిసిలు జడ్పిటిసి స్థానాలను కచ్చితంగా బిజెపి పార్టీ గెలుస్తుందని ఈ కార్యక్రమాల ద్వారా మాట్లాడడం జరిగినది అదేవిధంగా ఈరోజు భారతదేశంలో 140 కోట్ల ప్రజానీకానికి కావలసిన జి యస్ టి పూర్తిగా తగ్గింపు చేసి దేశ ప్రజలకు దసరా కానుకగా ఇవ్వడం జరిగినది దీనివలన ప్రజలకు వస్తు సేవలపై పూర్తిగా పన్ను తగ్గించడం జరిగినది గ్రామాలలో వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలే* కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పల్లె ప్రజలకు చేసింది ఏమీ లేదు కాబట్టి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సమావేశంలో తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల కన్వీనర్ సంజీవరెడ్డి రాష్ట్ర ఎస్సీ కార్యవర్గ సభ్యులు మాదన్న రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు భీమ్సేన్ రావు ప్రధాన కార్యదర్శులు వెంకటాపురం మహేష్ పులికల్ రాజశేఖర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ యాపదిన్నె గిడ్డన్న (పులి) జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మేకల ఆంజనేయులు ఐజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ రామకృష్ణ భీమన్న ముదిరాజ్ శంకరన్న టీ నరసింహులు బసవరాజ్ గోపాల్ దేషన్న నరసన్న గౌడ పరశురాముడు భీమ్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు