Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ పర్వదిన శుభసందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబిర్ చెరువు కట్టమీద, శివమ్మా కాలనీ రామాలయం వద్ద సోమవారం రాత్రి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆద్వర్యంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిధిగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ. సి చైర్మన్ అరేకపూడి గాంధీ హాజరవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ ఆల్విన్ కాలనీ డివిజన్ అడపడుచులందరు బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ అందరికి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు.కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు విచ్చేసి బతుకమ్మ ఆడిన మహిళలందరికి కృతజ్ఞతలు తెలియచేసారు. ప్రతి సంవత్సరంలాగానే ఈసారికూడా బతుకమ్మ పండుగ ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించుకునేందుకు సహకరించిన ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసారు. డివిజన్ ప్రలందరికి బతుకమ్మ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.