Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 33 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేను కొన

కాట్రేని కోన మండలం చిరయానం గ్రామంలో వేంచేసి యున్న కనకదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి.. ప్రముఖ పురోహిత బ్రహ్మ పెద్దింటి వ్యాస మూర్తి శర్మ ఆధ్వర్యంలో భక్తులచే ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఎనిమిదవ రోజైన సోమవారం మూలా నక్షత్ర సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతి స్వరూపిణిగా దర్శనమివ్వగా, సర్పంచ్ ఓలేటి మంగాదేవి నాగేశ్వరరావు ల దంపతుల తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు భక్తులు పాల్గొని పునీతులయ్యారు. చిన్నారులు అత్యంత భక్తి శ్రద్ధలతో సరస్వతీ నమస్తుభ్యం… అంటూ మంచి జ్ఞానాన్ని, విద్యని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ పుస్తకములు కలములు పెట్టి పసుపు కుంకుమలు వివిధ రకాల పుష్పములచే పూజించారు. సర్పంచ్ నాగేశ్వరరావు దంపతుల ఆర్థిక సహాయంతో చిన్నారులకు పెన్నులు ప్రసాదములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి వర్మ, అంగాని నరసింహమూర్తి, నాగలక్ష్మి, దశరధుడు,కాలాడి ప్రసాద్, స్రవంతి,నాగరాజు,సంగీత,దివ్య, భవాని, పోతురాజు, రాజేశ్వరి, వీరలక్ష్మి, అప్పన్న బాబు, నరసింహ స్వామి సత్యనారాయణ లతోపాటు అధిక సంఖ్యలో భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.