జనంన్యూస్. 01.నిజామాబాదు. ప్రతినిధి..
జిల్లా లో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ దాసు కోరారు. 2025 అక్టోబర్ 1 ధర్పల్లి మండల కేంద్రంలో న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. దాసు ఈ సందర్భముగా మాట్లాడుతూ అన్నదాత రైతన్న, వరుణుడి కోపాగ్నికి, సర్వం కోల్పోయి ఆవేదన చెందుతున్నారని ఆయన తెలిపారు. చేతికి చిన్న పంటలుచేజారిపోయి, నీటిలో ముద్దాయి పనికి రాకుండా పోయిందని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటకు కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి ప్రభుత్వం తీసుకెళ్లాలని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని, అధికారులను కోరారు.నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వర్షాల వల్ల కూలిపోయిన ఇళ్లకు ఇందిరమ్మ పథకం ఆంక్షలు లేకుండా వర్తింపజేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి రాజకీయాలకతీతంగా నిధులు కేటాయించాలని ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోరారు. వరద బాధితులతో రాజకీయం చేయొద్దని, రైతు కూలీలకు అండగా నిలవాలని ఆయన కోరారు. బాలయ్య మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులదే అనే విషయాన్ని మర్చిపోకూడదని ఆయన అన్నారు. తెగిపోయిన రహదారులను యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయించాలని ఆయన ప్రజా ప్రతినిధులను, జిల్లా కలెక్టర్ ని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ నాయకులు , ప్రజా సంఘాల నాయకులు అబ్దుల్, ఫ్రీన్స్ , వెంకటేష్, నారాయణ,వెంకటి, గంగాధర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.వి.బాలయ్య.కార్యదర్శి
సిపిఐ ఎంఎల్ఏ న్యూడెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కమిటీ


