Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

స్వర్గీయ శ్రీ జి.ఎం.సి. బాలయోగి 74వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు , అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి , ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ , మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు , మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గుత్తులు సాయి పాల్గొన్నారు.చెల్లె అశోక్ ,గొల్ల కోటి దొరబాబు, జిమ్మీ, గొల్ల కోటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ “బాలయోగి గారు ప్రజల హృదయాలలో చిరస్మరణీయ స్థానం సంపాదించారనీ. ఆయన ప్రజాసేవా దృక్పథం, అభివృద్ధి పట్ల నిబద్ధత ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం అని . ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి అని,” తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు మీడియా మిత్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు