తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 1
జహీరాబాద్ నియోజకవర్గ ము ( సంగారెడ్డి జిల్లా) మొగుడంపల్లి మండల్లోని భవనమ్మపల్లి గ్రామంలో మాత తుల్జా భవాని నవ రాత్రులను పురస్కరించుకుని రోజు జహీరాబాద్ పట్టణం భవాని మాతా మందిరం నుండి శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ పాదయాత్ర కమిటీ ఆధ్వర్యంలో భవనం పల్లి లోగల శ్రీ తుల్జా భవాని మాత మందిరం వరకు పాదయాత్ర గా వెళ్లడం జరిగింది. మార్గమధ్యలో సత్వర్ ,ఖాసింపుర్ , గోపంపల్లిలో పాదయాత్రగా వచ్చిన భక్తులకు అరటిపండ్లు అన్నదానం లను ఏర్పాటు చేశారు. దుర్గా భవాని మాత మందిరం సాక్షాత్తు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చే నిర్మించబడింది. ఇది మన ప్రాంతంలో ఉండడం మన అందరి అదృష్టం. ఈ దేవి నవ రాత్రుల్లో దర్శనానికి తెలంగాణ ప్రాంతంలో వారే కాకుండా కర్ణాటక ప్రాంతం వారు కూడా అనేకమంది భక్తులు వస్తూ ఉంటారు. పాదయాత్రలో కమిటీ సభ్యులు కొండపురం నర్సిములు,డాక్టర్ .పెద్దగొల్ల నారాయణ, విశ్వనాథ్ యాదవ్ ,దుర్గాయ్య, శంకర్ సాగర్ ,మోహన్, మాదినం,, శివప్రసాద్,,, మహమ్మద్ ఇమ్రాన్ ,, మారుతి ఆనంద్ ఈశ్వర్ ,సందీప్, జగన్ శంకర్ యాదవ్ , సాయినాథ్ కలాం, పవన్ ,తుక్కరామ్,నితీష్, హరీష్ పాటిల్ ,సిద్దు ముదిరాజ్, అరుణ్, గ్రామస్తులు నగేష్, తదితరులు పాల్గొన్నారు.


