Listen to this article

సెప్టెంబర్30(జనంన్యూస్)

అమ్మల గన్నా అమ్మ మూడుపూటల మూలపుటమ్మ సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదవ రోజైనమంగళవారం అష్టమిని పురస్కరించుకొని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని దేవి మహా గౌరీ (ఎరుపు రంగు పట్టు వస్త్రాలతో) శ్రీ దుర్గా దేవి అవతారంలో దగడగలడుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రాజగోపురం లోఉత్చవ విగ్రహాన్ని సైతం మహా గౌరీ దేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోకుల్ షెడ్ లో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్చవ విగ్రహాన్ని మహా గౌరీ (శ్రీ దుర్గా దేవి) ఎరుపు రంగు పట్టు వస్త్రాలతో అలంకరించి గణపతి పూజతో ప్రత్యేక పూజలు నిర్వహించగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ కార్యదర్శి , మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దంపతులు దర్శించుకొని ప్రత్యేకపూజలలో పాల్గొని మహా గౌరీ రూపం లో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా రాజగోపురం ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుని గోకుల్ షెడ్ లో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని మహా గౌరీ దేవి రూపంలో దర్షనమిచ్చిన వన దుర్గ భవాని మాత ను దర్శించుకుని తరించిపోయారు. భక్తుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. *రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి* *మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పద్మా, శేరీ సుభాష్ రెడ్డి …….*రాష్ట్రంలో ఎల్లప్పుడూ వర్షాలు బాగా పడుతూ పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రము రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వెల్లడించారు. దుర్గామాత కరుణ కటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు వారు తెలిపారు.వారి వెంట పాపన్నపేట సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్, ఏడుపాయల మాజీ చైర్మన్ బాల గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనాథ్ రావు, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,గంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రఘు, మనోహర్ ,మండల పరిధిలోని వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.*నేడు శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా* నేడు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదవ రోజైన బుదవారం నవమిని పురస్కరించుకొని శ్రీ మహిషాసుర మర్ధిని దేవి (సిద్ధిరాత్రి) దేవిగా ( మెరూన్ రంగు పట్టు వస్త్రాలతో) త్రిశూలం చేత బూని దర్శనమివ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారినీ దర్శించుకొని అమ్మవారి కృపకు కృపార్థులు కాగలరని కోరారు.