Listen to this article

జనం న్యూస్, కోహెడ మండలం,అక్టోబర్ 01,

సిద్దిపేట జిల్లా,కోహెడ మండలం, బస్వాపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా పదవ రోజు రావి చెట్టు దుర్గామాత, శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. బస్వపూర్ లో రావిచెట్టు దుర్గామాత పది వసంతాలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో అమ్మవారి సేవలో మహిళలు కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారికీ పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం దుర్గామాత వద్ద లలిత సహస్రనామ స్తోత్రాలు పారాయణం చేసి రావి చెట్టు దుర్గామాత చల్లని దీవెనలు ప్రజల అందరిపై సుభిక్షంగా ఉండాలని పూజా లో పాల్గొనడం జరిగింది. అనంతరం, కీర్తిశేషులు కుర్ర ఐలయ్య,(ఏజెంట్) పోషవ్వ, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది రావి చెట్టు దుర్గామాత కార్యకర్తలు,మాల ధారణ భవానీలు, మాతలు,మహిళలు, భక్తులు, గ్రామ ప్రజలు, అధిక సంఖ్యలో అమ్మవారి సేవలో పాల్గొనడం జరిగింది.