Listen to this article

అకాలవర్షాలతో రైతులు ఆగమాగం.

CPM జిల్లా కార్యదర్శి K. నర్సమ్మ

జనం న్యూస్ అక్టోబర్ 1 చిలిపి చెడు మండల ప్రతినిధి

అకాలవర్షాలతో రైతన్నలు ఆగమాగం అయ్యారని CPM మెదక్ జిల్లా కార్యదర్శి K. నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల పార్టీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత 20 రోజులుగా కురిసిన అకాలవర్షాలతో సింగూరు డ్యామ్ గేట్లు విపడంతో చిలిపచేడ్ మండలం, కౌడిపల్లి మండలలో అనేక పంటలు మునిగిపోయాయని ఆమె ఆవేదన తెలిపారు. రైతులు పంట చేతికి వస్తే కుటుంబ అవసరాలు తిరుతయని ఆశగా చూస్తుంటే పంట మునిగిపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు. కానీ ప్రభుత్వం నుండి రైతులకు ధైర్యాని ఇవ్వాల్సిందిపోయి, కనీసం రైతులను కానేతికూడా చూడకపోవడం దూర్మార్గం అన్నారు. ఇప్పటికే గ్రామాలలో పంట పొలాలను పరిశీలించి వ్యవసాయ శాఖ సభలు నిర్వహించి, నష్టం అంచనా వేయాల్సింది కానీ అధికారులు ఎందుకు అంచనా వేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా గ్రామాలలో పంట నష్టం ఎంత అనేది పరిశీలించి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ. మల్లేశం, కార్యవర్గ సభ్యులు కడారి నాగరాజు, ఏరియా కమిటీ సభ్యులు డి. మల్లేశం, నాయకులు శేఖర్, నర్సింలు, పోచయ్య, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.