బిచ్కుంద అక్టోబర్ 1 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ అప్పా షెట్కార్ గారి చిత్ర పటానికి జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు డెలికేట్ విఠల్ రెడ్డి, నిజం సాగర్ పార్టీ అధ్యక్షు డు మల్లేష్, పార్టీ అధ్యక్షుడు సాయిలు బిచ్కుంద పార్టీ అధ్యక్షుడు గంగాధర్ మాజీ జెడ్పిటిసి నాగనాథ్, జుక్కల్ సొసైటీ చైర్మన్ శివానంద్, మీర్జాపూర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ ,రమేష్ దేశాయ్ శ్యామ్ పటేల్, పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి , రవి పటేల్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, సతీష్ పటేల్, అజీమ్, జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



