Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 1

తర్లుపాడు మండలం తుమ్మలచెరువు మరియు జగన్నాధపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి మాట్లాడుతూ ఖరీఫ్ 2025 ఈ పంట నమోదు అక్టోబర్ 10 న ముగుస్తుందని పేర్కొన్నారు. కాబట్టి రైతులు ఖరీఫ్ లో సాగు చేసిన పంటలను, సాగు చేయకుండా ఖాళీగా ఉన్న బీడు పొలాలను(ల్యాండ్ పార్సిల్ )అన్ని గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. రైతులు తమ వంతు బాధ్యతగా వ్యవసాయ సహాయకుల వద్దకు వెళ్లి తప్పనిసరిగా వారి పొలాలను నమోదు లోనికి తీసుకొని రావాలని ఆమె కోరారు. జీవో నెంబర్ 740 ప్రకారం నల్లబర్లీ పొగాకు సాగు చేపట్టకూడదని రైతులందరికీ వివరించారు. రబీలో పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలైన సెనగ, మినుము, జొన్న సోయచికుడు, మొక్కజొన్న, బొబ్బర్లు మొదలగు పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు. పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలు సాగు కరపత్రాలను రైతులకు అందజేశారు. తుమ్మల చెరువు రైతు సేవ కేంద్రం నందు రైతులుకి అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచామని అవసరమైన రైతులు వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించి యూరియా తీసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ఈ క్రాప్ సూపర్వైజర్ చెక్ రికార్డులను గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ పంట నమోదు చేసిన పొలాలను ఆమె తనిఖీ చేశారు. కార్యక్రమంలో వి ఏ ఏ మల్లికార్జున, గ్రామ రైతులు పాల్గొన్నారు.