అమ్మవారి పూజలో పాల్గొన్న అర్థం జ్యోతి లక్ష్మణ్ దంపతులు
జనం న్యూస్, అక్టోబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.పదవ రోజు బుధవారం అర్థం జ్యోతి లక్ష్మణ్ దంపతులు అమ్మవారి పూజలో పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు.అనంతరం ప్రత్యేక అలంకరణలో ఉగ్రరూపినిగా శ్రీ మహిషాసుర మర్ధిని అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా శరావళి మాత ఉత్సవ సేవా సమితి వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2.5గ్రాముల బంగారం ముక్కుపుడక టోకెన్ పెట్టడం జరిగిందని,శరావళి మాత ఉత్సవ సేవ సమితి సభ్యుల వద్ద 301రూపాయలతో టోకెన్ తీసుకొని భక్తులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,శరావళి మాత ఉత్సవ సేవా సమితి సభ్యులు,గ్రామ ప్రజలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.


