జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా.
దేశంలోనే 4వేల నుండి 15వేల వరకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మే అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారుబుధవారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను నందలూరు గ్రామంలోని దుర్గాపురం లో సచివాలయం సిబ్బందితో కలిసి టిడిపి రాజంపేట ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు సూచన మేరకు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ పెన్షన్ పంపిణీ చేశారన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోఒకటోతారీకు అనగానే ఒక పండగ వాతావరణం కనబడు తుందని ఉదయం 6 గంటల నుండి సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు వివిధ పెన్షన్లను అద్భుతంగా సచివాలయం సిబ్బంది పనితీరు ఉందన్నారు వైకాపా నాయకులు మాత్రం విషం చిమ్ముతూ పెన్షన్లను తొలగిస్తున్నారని పెన్షన్ దారులలో ఆందోళన కలిగిస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో అనేక అక్రమ పెన్షన్లను నమోదు చేశారని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్క అర్హులకి పెన్షన్ ఇవ్వాలని లక్ష్యంతో ఉన్నారని దొంగ పింఛన్లు తీసే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి సుబ్రహ్మణ్యం, ఆవుల రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు



