జనం న్యూస్,అక్టోబర్03, అచ్యుతాపురం:
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో అచ్యుతాపురం
మండలం పూడి ఆర్అండ్ఆర్ కాలనీ వైఎస్ఆర్ నగర్ లో ఎంపియూపి స్కూల్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 56 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని రక్త దానం శిబిరం నిర్వాహకులు రాజాన సంజీవ్ మరియు వారి మిత్ర బృందం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ మెగా బ్లడ్ క్యాంపును నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ బ్లడ్ క్యాంప్ వలన వచ్చిన రక్తాన్ని ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు, ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ లాలం నరేంద్ర, మాసవరపు కాసుబాబు,పండు,పవన్,హేమంత్ కుమార్,ధన తదితరులు పాల్గొన్నారు.



