Listen to this article

జనం న్యూస్ 03 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలం తనగల కాషాయం దళం లోకి భారీగా వలసలు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నరేష్ ముఖ్యనాయకులు రవిగౌడ్ ,రాజుగౌడ్ శంకరన్నగౌడ్,సిద్దయ్యగౌడ్ ,నరేంద్ర తో పాటు 100 మందికి పైగా బీజేపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు ఈ సందర్భంగా బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక సంస్థల కన్వినర్S. రామచంద్రారెడ్డి కొత్తగా చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయి.జిల్లా లో బీజేపీ పాలమూరు ఎంపీ డీకే అరుణమ్మ నాయకత్వం లో రోజురోజు కు పార్టీ శరవేగంగా దూసుకెలుతుంది.
బీజేపీ తీసుకొస్తున్న పథకాలు కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలిగిస్తున్నాయి.
గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, మహిళల ఆర్థిక శక్తివంతం, యువతకు ఉపాధి కల్పన, అన్ని రంగాల్లో బీజేపీ ముందంజలో ఉందన్నారు.ప్రజలు విశ్వాసంతో బీజేపీ వైపు ఆకర్షితులవడం సహజం.
భవిష్యత్తులో తనగల గ్రామం అభివృద్ధి చెందడానికి బీజేపీ తప్ప మరే పార్టీకి శక్తి లేదన్నారు.ఈ చేరికలతో తనగల గ్రామంలో బీజేపీ మరింత బలపడిందని,ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పార్టీ అంకితభావంతో పనిచేస్తుందని నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి గారు మధుసూదన్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు ఐజ పట్టణ అధ్యక్షులు భగత్ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ హరికృష్ణ రంజిత్ పటేల్ మాజీ మండల అధ్యక్షులు నరసింహులు పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ భీమన్న తదితరులు పాలుగోన్నారు…