

ఆర్యవైశ్య సంఘం సభ్యులు జనం న్యూస్ జనవరి 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు అన్నారు.బుధవారం జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ వద్ద వాసవి సేవ సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ అన్నదానం కార్యక్రమంలో దాదాపు 300 మందికి పైగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు చంద్రశేఖర్,పట్టణ అధ్యక్షులు కొండలు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ధ సత్యం, గుబ్బ శ్రీనివాస్ , అమర రాము, వాళ్ళలా వెంకటేశం, జూలకంటి శ్రీనివాస్, రాము,బుద్ధ రాములు,వెంకటేశం,బుద్ధ లక్ష్మీ నర్సయ్య, కృష్ణమూర్తి, శ్రీనివాస్, చిగుళ్లపల్లి వెంకటేశం, వీర భద్రయ్య, వాసవి సేవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.