Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో సర్పంచ్ ఆ చెల్లు సురేష్ వైస్ ప్రెసిడెంట్ సీఎం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమలాపురం ఎంపీ గంటి* హరీష్ మాధుర్ . ఈరోజు చెయ్యేరుగ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ సంయుక్తంగా శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముమ్మడివరం పర్యటనలో భాగంగా వారు చెయ్యేరు గ్రామాన్ని సందర్శించారని ఆ సందర్భంగా వారు కొన్ని హామీలు ఇచ్చారని అందులో భాగంగా ఈరోజు సుమారు 32 సిసి రహదారులకు ఏకకాలంలో శంకుస్థాపనలు చేసుకుంటున్నామని ఈ మొత్తం అభివృద్ధి పనులకు సుమారు 3 కోట్ల 56 లక్షల రూపాయల వ్యయం అవుతుందని తెలిపారు. ఇన్ని అభివృద్ధి పనులకు ఒకేసారి అనుమతులు ఇచ్చినా ముఖ్యమంత్రి కి ఉపముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మార్వో ,ఎంపీడీవో, ఎస్సై ఐ అవినాష్ నడింపల్లి సుబ్బరాజు, గొల్ల కోటి దొరబాబు తటపల్లి నాగేంద్ర ఆకాశపు శ్రీను నంద్యాల వెంకన్న బాబు టిడిపి జనసేన బిజెపి సీనియర్ నేతలు కార్యకర్తలు, అభిమానులు ప్రజలు అధికారులు మీడియా మిత్రులు పాల్గొన్నారు