జనంన్యూస్.నిజామాబాద్ రూరల్. 05.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం పరామర్శించారు. సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి లక్ష్మి నర్సమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన వార్త తెలుసుకున్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుకి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.రేకుల పల్లి లక్ష్మీ నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి వెంట రూరల్ బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.


