Listen to this article

జనం న్యూస్ 06 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

భీమ్ ఆర్మీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా మెల్లచెరువు వర్షిత్ ఆధ్వర్యంలో జరిగిన భీమ్ ఆర్మీ ధరూర్ మండలం సమావేశంలో భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు రక్షణగా భీమ్ ఆర్మీ ఉంటుందని, ప్రతి ఒక్కరు సామాజిక చైతన్యం కావాలని , రాజకీయ చైతన్యం కావాలని అంబేద్కర్ కాన్సిరాం ,ఆశయాలను ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు, నడిగడ్డలో ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేస్తూ సామాజిక మార్పు తీసుకురావాలని అన్నారు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావన్ నాయకత్వాన్ని నడిగడ్డలో బలపరచాలని అన్నారు ప్రతి ఇంటింటికి భారత రాజ్యాంగం, అంబేద్కర్ కాన్షిరం చిత్రపటాలని పెట్టేలాగా చేయాలన్నారు, ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయాలని అన్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలో భీమ్ ఆర్మీ మండల కమిటీని ఎన్నుకున్నారు భీమ్ ఆర్మీ ధరూర్ మండల అధ్యక్షుడిగా ఇదన్న ప్రధాన కార్యదర్శిగా మార్లబీడు ఏసన్న ఉపాధ్యక్షులుగా బి శ్రీనివాసులు కార్యదర్శులుగా నర్సింలు,కోశాధికారిగా నర్సింహా,్ముఖ్య కార్యదర్శిగా ఆంజనేయులు గౌరవ అధ్యక్షులు డి.సురేష్ సురేష్ ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జమ్మిచెడు సురేష్ భీమ్ ఆర్మీ జిల్లా కార్యదర్శి రేపల్లె లక్ష్మణ్ పాల్గొన్నవారు డేవిడ్, పవన్, బన్నీ, రాజు,గంగ రాజు యువత తదితరులు