జనం న్యూస్ 06 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గుంతల రోడ్డులో అదుపు తప్పి క్రింద పడుతున్న వాహనదారులు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి అయినటువంటి ఫ్లై ఓవర్ బ్రిడ్జి గుంతల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కిందపడి గాయాలు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గుంతల మయంగా మారిన రోడ్డుపై వాహనదారులు వెళ్లడంతో అదుపుతప్పి అనేక సందర్భాలు క్రిందపడి గాయాలు అయినా సందర్భాలు ఉన్నప్పటికీ రోడ్డును మాత్రం బాగు చేయకపోవడం బాధాకరమని, ఇకముందు వాహనదారులు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఉన్న గుంతలలో పడి తీవ్ర గాయాలు అయినాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ఉన్నటువంటి గుంతలు పూడ్చి వాహనదారులకు ఎలాంటి ప్రమాదాలు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్ అండ్ బి అధికారులను మరియు జిల్లా కలెక్టర్ స్పందించాలని సోషల్ మీడియా కు వాహనదారులు తెలిపారు.
అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన సెంట్రల్ లైటింగ్స్ అక్కడక్కడ పడకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు.


