రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని 1925 విజయ దశమి నాడు డా..కేశవరావ్ బలరాం హెగ్డేవర్ స్థాపించారు. సమర సత తో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణం లో నిమగ్నం అయిన సంఘం విజయ దశమి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న తరుణం లో ఉత్సవాన్ని కొండమల్లెపల్లి మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసి గ్రామము అంతా పథ సంచలనం చేసి దేవాలయం లో సంఘ వేడుకలు నిర్వహించి ముగింపు పలికారు. ప్రతి ఒక్కరూ దేశ సేవకి తమ వంతుగా సేవ చేయాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ కండ కర్యవహ ముఖ్య అతిథిగా వచ్చి సందేశం ఇచ్చారు. సుమారు 140 మంది ఆర్ ఎస్ ఎస్ కార్య నిర్వహణ లో పాల్గొన్నారు. ఉమ్మడి పీ.ఏ.పల్లి,గుడిపల్లి,మల్లేపల్లి, కండ కర్యవహ పాల్గొన్నారు.


