

తెలంగాణ జర్నలిస్టుల పోరం ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ.
కొత్తగూడెం ఆర్ సి జనవరి 29 ( జనం న్యూస్ పత్రిక)
ఎస్సీ వర్గీకరనే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ లో నిర్వహిస్తున్న
లక్ష డప్పులు-వెయ్యిల గొంతుల సభను విజయవంతం చేయాలని ఎంజేఎఫ్ (మాదిగ జర్నలిస్టుల ఫోరం) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెంగపొంగు సైదులు కోరారు.
బుధవారం కొత్తగూడెం టౌన్ ట్రాన్సిస్ గెస్ట్ హౌస్ లో కొత్తగూడెం నియోజకవర్గం సాయి సమావేశం జిల్లా అధ్యక్షులు కనుకు వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునందుకుని,గూడేల నుంచి కదిలే ప్రతి ఒక్కరు డప్పు చేతబట్టి కదలాలన్నారు.
మాదిగ జాతి బిడ్డలు వేలాదిగా తరలి వచ్చి లక్ష డప్పులు-వెయ్యిల గొంతుల కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేడి గుణ సురేష్, ట్రెజరర్ వాసాల సంపత్, జిల్లా నాయకులు దాట్ల రవీందర్ ,ఇల్లందుల దుర్గయ్య, సాక్షి శేఖర్, ప్రతాప్ ,రాజ్ కుమార్ ,మురళి ,సురేందర్ , తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ రాష్ట్ర నాయకులు, కొప్పుల రమేష్,
తదితరులు పాల్గొన్నారు.