Listen to this article

నేలకొరిగిన పలు రైతుల వరి పంట పొలాలు

టి ఆర్ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్

జనం న్యూస్ 6 అక్టోబర్ 2025 ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారం దండేపల్లి బావుపేట్ పలు గ్రామాలలో వాతావరణ పరిస్థితులు ఎడతెరిపిలేని వర్షాలు అన్నదాతను ఆగమాగం చేస్తున్నాయి భారీ వర్షానికి నేలకొరిగిన ఇరువురి రైతుల వరి పంట పొలాలు పూర్తిగా నేలకొరిగిందని విషయం తెలుసుకున్న సూరారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను సందర్శించి రైతులను పరామర్శించారు హింగే భాస్కర్ మాట్లాడుతూ, పంట పొలాలు చేతికందే సమయానికి నేలమట్టం కావడం రైతులు ఒక్కసారిగా లబోదిబో అని పంట నష్టం వాటిలిందని గోడున విలపించారు వర్షం కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయని ఈ నష్టానికి రైతులకు ప్రభుత్వం ఒక్కో ఎకరానికి 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రైతులు ఇప్పటికే అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బ్యాంకులు రైతులపై ఉన్న పాత రుణాలను రుణమాఫీ చేయాలని కొత్త రుణాలు తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వం రైతుల కోసం పంట బీమా పథకాన్ని ఏర్పాటు చేయాలని పంట బీమా ద్వారా అతివృష్టి అనావృష్టి వంటి సహజ విపత్తుల వల్ల సంభవించే నష్టాలను తగ్గించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రైతు రక్షణ సమితి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నష్టపోయిన రైతులు హింగే రవీందర్, ఎర్రబెల్లి లింగారావు, సాతూరి శ్రీపతిరావు, సాతూరి ప్రహల్లా రావు, పులింటి రాములు, హింగే రమేష్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, బిట్ల రాజు, గడల సమ్మయ్య, ఎండి రియాజ్, బచ్చు సంపత్ రావు, మేకల రాజ కొమురయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.