Listen to this article

టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్

జనం న్యూస్, అక్టోబర్ 6, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )

వృత్తులన్నిటిలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ అన్నారు, మండల పరిషత్ ఉన్నత పాఠశాల బంగ్లా వెంకటాపూర్ పాఠశాలలో టిపిటిఎఫ్ సీనియర్ నాయకులు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు తిగుళ్ల ప్రభాకర్, ఉద్యోగ విరమణ అభినందన సభకు హాజరై అభినందనలు తెలిపారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని వృత్తులన్నిటిలలో ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని అలాంటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో 29 సంవత్సరాలు తన సేవలు అందించి ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు ప్రభాకర్,అని కొనియాడారు సుదీర్ఘ కాలం పని చేసినప్పటికీ ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ సహజమని అన్నారు. గతంలో ఉద్యోగ విరమణ చేసినప్పుడు ప్రతి ఉపాధ్యాయునికి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేవారని, కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడం ప్రభుత్వాల నైతిక బాధ్యత అని, వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రం, రాజయ్య,రాజులు,యూసుఫ్, జోన్ కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పాపిరెడ్డి,జిల్లా కౌన్సిలర్ ఎల్లయ్య, నరసింహులు గౌడ్, దమ్మని మల్లయ్య, గజ్వేల్, ములుగు, జగదేపూర్, వర్గల్ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల నాగరాజు, గోక విద్యాసాగర్, విద్యాదర్ రెడ్డి, రాజనర్సింహ, సత్తయ్య, పర్వతం నరసయ్య, కర్ణాకర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.