జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం లో కొత్త బోయినపల్లి పీఎం శ్రీ ఎస్ జె ఎస్ ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఎక్స్పోజర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం క్షేత్రస్థాయి విజ్ఞాన పర్యటన చేశారు. ప్రధానోపాధ్యాయు లు భారతి ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు ఓబులేసు, ఎస్.వి. రామ రాజు,రాజయ్య,అనిల్ కుమార్, అమరావతి, ప్రణవి కార్యక్రమములో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు కొత్త బోయినపల్లి లో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం, గుండ్లూరు శ్రీ సాయి బాబా ఆలయం, నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మున్సిఫ్ కోర్ట్, రైల్వే స్టేషన్, నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీ సౌమ్య నాథ స్వామి ఆలయం, బౌద్ధ రామాలు తదితర ప్రాంతాలను విద్యార్థినీ విద్యార్థులతో కలసి సందర్శించారు. వాటి ప్రాముఖ్యతను వివరించారు.



