జనం న్యూస్ అక్టోబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కొత్త గట్టు సింగారం గ్రామంలోని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి* వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం.శాయంపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి *కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు ఇస్తూ, వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది.రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు,మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, విద్యార్థులకు స్కూటీ ఇవ్వలేదు,కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు ఇవ్వలేదు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడగాలని కోరారు.ఈ కార్యక్రమంలో శాయంపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి,సీనియర్ నాయకులు సదా శివ రెడ్డి, జనార్ధన్, సాంబయ్య,లింగరావు ,సునీల్, రాకేష్,రవి,సాయి,గ్రామ సోషల్ మీడియా కన్వీనర్. పెంబర్తి వినయ్, కార్యకర్తలు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు


