

జనంన్యూస్.. 07.నిజామాబాదు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆకస్మికముగా చెకింగ్ లు నిర్వహించడం జరిగింది . అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్, శివాజీ నగర్ , కంటేశ్వర్, దేవీ రోడ్డు , ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ లో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా బయటి ప్రాంతాలలో నుండి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆర్టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూ మరియు ఎలాంటి కారణము లేకుండా బయట తిరుగుతున్నటువంటి వారిని చెక్ చేయడం జరిగింది. అనంతరం వారందరికీ కౌన్సిలింగ్ లు నిర్వహించి రాత్రి సమయాలలో మళ్లీ తిరిగి నట్లయితే వారిపై తగు కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.
