Listen to this article

జనం న్యూస్ అక్టోబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ – 2025″ జిల్లా స్థాయి అవార్డ్స్ గ్రహీతలకు అవార్డ్స్ అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.రాజమహేంద్రవరం ఆనం కళావేదిక లో “స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ -2025” ప్రధానోత్సవ కార్యక్రమoలో పాల్గొన్ని జిల్లా స్థాయి అవార్డ్స్ గ్రహీతలకు అవార్డ్స్ అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్,ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు,తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏఎస్ తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఐఏఎస్.పరిశుభ్రత పట్ల సమాజంలో చైతన్యం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు రావాలి.స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు — ఇది ప్రతి పౌరుడి నిత్యజీవితంలో భాగం కావాలి. శుభ్రమైన పరిసరాలు మాత్రమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది వేస్తాయి.ఈ కార్యక్రమంలో అవార్డ్స్ గ్రహీతలు,అధికారులు,తూర్పుగోదావరి జిల్లా కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.