Listen to this article

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 7

మొగుడంపల్లి మండలంలో హాస్టన్ కంపెనీ కంపెనీపై స్థానికుల ఆగ్రహం జహీరాబాద్ నియోజకవర్గం
మొగుడంపల్లి మండల పరిధిలో స్థాపించబడిన హాస్టన్ కంపెనీపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కంపెనీ ఏర్పాటు సమయంలో 80 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆ వాగ్దానం పూర్తిగా విస్మరించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీలో ఎక్కువమంది ఉద్యోగులు నార్త్ ఇండియన్లు కాగా, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయి. అంతేకాకుండా, మిల్క్ సప్లై వంటి సేవల్లో కూడా స్థానిక రైతులు, పాల ఉత్పత్తిదారులను విస్మరించి, బయటి వ్యక్తుల ద్వారా సరఫరా చేయడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులు ఈ విషయంపై స్పందిస్తూ, “జహీరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధి పేరుతో కంపెనీలు వస్తున్నాయి కానీ లాభం మాత్రం బయటి వారికే వెళ్తోంది. అష్టం కంపెనీ స్థానికుల హక్కులను దోచుకుంటోంది” అని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై విచారణ జరిపి, స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, మిల్క్ సప్లై స్థానిక రైతుల నుంచే తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.