జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
పేదలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో మేలు చేస్తాయని ఎమ్మెల్సీ సోము వీర్రాజు న్నారు.వెంకటేశ్వర వెల్ఫేర్ సొసైటీ మరియు కమ్యునిటీ పారామెడిక్స్&ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ది పీఎంపీ అసోసియేషన్) డాక్టర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆధ్వర్యంలో మూలస్ధానం గ్రామం లక్ష్మీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఆవరణలో స్ధానిక పీఎంపీ సభ్యులు,సొసైటీ వ్యవస్ధాపక అధ్యక్షులు తోట వెంకటేశ్వరరావు సారధ్యంలో ఆదివారం రాజమండ్రి కి చెందిన సుభద్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించి మాట్లాడుతూ పల్లెల్లో పేదల ఆరోగ్య సంరక్షణకు ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు,గ్రామాల్లో ప్రజల వ్యాధులకు ఆయుస్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ లో నాన్ కమ్యునికేబుల్ డిసీజస్ 4.0 ద్వారా స్క్రీనింగ్ చేసి అందించే వైద్య సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ వైద్య శిబిరం లో డాక్టర్ ఆకుల దుర్గా ప్రసాద్,డాక్టర్ రాజేష్ వర్మ, డాక్టర్ ప్రవీణ లు హాజరై వైద్య సేవలందించారు.ఉచితంగా ఈసీజీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి సుమారు అయిదు వందల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లంక వర ప్రసాదరావు,పీఎంపీ అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు కోన సత్యనారాయణ,ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బళ్లా శ్రీనివాసరావు,ఆలమూరు మండల పీఎంపీ కన్వీనర్ ఏడిద లక్ష్మణాచార్యులు, బిజెపి నాయకులు సత్తిబాబుగౌడ్,నాగిరెడ్డి స్వామి,టీడీపీ అధ్యక్షులు గానుగుల చిన్న,జనసేన అధ్యక్షులు తోరాటి అర్జునరావు,ఆలమూరు టీడీపీ అధ్యక్షులు ఈధల సత్తిబాబు, మండల జనసేన అధ్యక్షులు సలాది జయప్రకాష్ నారాయణ,దొడ్డా రామలక్ష్మి, తోరాటి ఆంజనేయులు,సుభద్ర హాస్పిటల్ ఎండీ ఆకుల రాంబాబు,హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.



