బిచ్కుంద అక్టోబర్07 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణ కేంద్రంలో ముదిరాజ్ కుల గురువు శ్రీ వాల్మీకి మహర్షి గురువు గారి జయంతి సందర్భంగా బిచ్కుంద వాల్మీకి మహర్షి మందిరం వద్ద మంగళవారం నాడు బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్ సీనియర్ నాయకుడు నౌషా నాయక్ పాల్గొని ముదిరాజ్ కుల గురువు శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలదండ వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం , పతాకావిష్కరణను గావించారు. నైవిద్యాన్ని, సమర్పించారు.. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దశరథ్ స్వామి, బండు పటేల్, మైనార్టీ నాయకుడు ఖలీల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, ముదిరాజ్ సంఘ పెద్దలు,యువకులు, ,తదితరులు పాల్గొన్నారు.


