Listen to this article

జుక్కల్ అక్టోబర్ 7 జనం న్యూస్

మంగళవారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి తో జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమావేశమయ్యారు..స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా..
జుక్కల్ నియోజకవర్గంలోని పరిస్థితుల గురించి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్యమంత్రి కి వివరించారు..నిరంతరం తాను ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం,గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండటం, ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని..స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు..వరదల సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించి ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందిస్తూ..జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు..