జనం న్యూస్ అక్టోబర్ ఏడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
తాళ్ళరేవు మండలం చొల్లంగి గ్రామం లొని శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానము నూతన చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు . పితాని బాలకృష్ణ తాళ్ళరేవు మండలం చొల్లంగి గ్రామంలోని శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం మనకు కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన ధర్మకర్తల మండలి మరియు చైర్మన్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు వేడుక జరిగింది.ముందుగా ఆలయ ఈవో నూతన చైర్మన్ స్వర్ణ వి.వి సింహాద్రి( శ్రీను) గారు మరియు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.తదుపరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల రాజు ఈ కార్యక్రమం ను ఉద్దేశించి మాట్లాడారు.ముందుగా శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానానికి చైర్మన్ మరియు సభ్యులుగా ఎన్నికైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆలయ అభివృద్ధిలో మీ పాత్ర ఎంతో ఉంటుంది మీకు అప్పగించిన ఈ బాధ్యతలో సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆకాంక్షిస్తున్నాను. తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యక్రమలో కూటమి సీనియర్ నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఆలయ అధికారులు మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



