జనం న్యూస్ అక్టోబర్ 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము:
మోర్తాడ్ మండలంలో ఎస్ జి టి గా విధులు నిర్వహించిన మగ్గిడి ప్రవీణ్ ఇటీవల స్కూల్ అసిస్టెంట్ (గణితం) హోదాలో పదోన్నతి పొంది, ఏర్గట్ల మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల తొర్తి కి బదిలీపై రావడం జరిగింది.ఈ సందర్భంగా పి ఆర్ టి యు ఏర్గట్ల మండల కార్యవర్గం ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ, శాలువా కప్పి సత్కరించారు.మోర్తాడ్ మండలంలో సంఘానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించారు.మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “ప్రవీణ్ గారు మోర్తాడ్ మండలంలో సమర్థంగా విధులు నిర్వహించారు. సంఘానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనది. ఇప్పుడు ఏర్గట్ల మండలంలో చేరడం సంతోషకరం. ఆయనతో కలిసి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తాం,” అని తెలిపారు.మగ్గిడి ప్రవీణ్ మాట్లాడుతూ –
“ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన ప్రమోషన్ లభించడం ఆనందంగా ఉంది. విద్యార్థుల ఉన్నత వికాసం కోసం కృషి చేస్తాను. సంఘపరంగా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తాను,” అన్నారు.అలాగే, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గాండ్ల రాజశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దశేందర్, గటాడి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి రాజేందర్, జిల్లా కార్యదర్శి సాదుల గంగాధర్, మండల అసోసియేట్ అధ్యక్షులు మైసాల సుధాకర్, మండల కార్యదర్శి ఇమాముద్దీన్, అలాగే తొర్తి పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


